గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌పై వేటు.. ఆయన స్థానంలో..

గాంధీ ఆస్పత్రి

ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగానికి హెచ్‌వోడీగా ఉన్న ఆయన్ను గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్‌గా నియమించారు.

  • Share this:
    తెలంగాణలో కోవిడ్ ప్రధాన ఆస్పత్రి గాంధీ విషయంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌పై వేటు వేసింది. ఆయన స్థానంలో డాక్టర్ రాజారావుకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం కోవిడ్19 కన్వీనర్, జనరల్ మెడిసిన్ విభాగానికి హెచ్‌వోడీగా ఉన్న ఆయన్ను.. గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్‌గా నియమించారు. ఇక ప్రస్తుత సూపరింటెండెంట్ శ్రవణ్‌ను కరోనా కోఆర్డినేటర్‌గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.

    కాగా, తెలంగాణలో సోమవారం 14 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని.. మరో ఇద్దరు చనిపోయారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. GHMC పరిధిలో 12, మేడ్చల్‌, నిజామాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని తెలిపింది. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 186 మంది కోలుకోగా... 23 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 663 కరోనా యాక్టివ్ కేసులున్నాయని తాజా హెల్త్ బులెటిన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published: