కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ.. గవర్నర్ అభినందనలు

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.కొవాక్సిన్ (COVAXIN) అనే వాక్సిన్‌ను తయారుచేసింది.

news18-telugu
Updated: June 30, 2020, 7:26 PM IST
కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ.. గవర్నర్ అభినందనలు
గవర్నర్ తమిళిసై
  • Share this:
దేశీయంగా తొలిసారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీకి చెందిన ఈ సంస్థ ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను డెవలప్ చేసిందని తమిళిసై తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో భారత్ బయోటెక్ కృషి అభినందనీయమని ఆమె కొనియాడారు.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.కొవాక్సిన్ (COVAXIN) అనే వాక్సిన్‌ను తయారుచేసింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు గాను ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)అనుమతి ఇచ్చింది. జులైలో దేశవ్యాప్తంగా కొవాక్సిన్ ఔషద ప్రయోగాలు జరగనున్నాయి.
First published: June 30, 2020, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading