మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ట్రాన్స్‌ఫర్ చేసిన రూ.1500 మీ అకౌంట్‌లోకి రాలేదా? అయితే ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.

news18-telugu
Updated: April 25, 2020, 8:46 AM IST
మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నిరుపేదలు ఇబ్బందులు పడకూడదని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యల్ని తీసుకున్న సంగతి తెలిసిందే. తెల్లకార్డు ఉన్నవారికి రేషన్‌తో పాటు నిత్యావసరాల కోసం రూ.1500 ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ఇప్పటికీ కొందరు రేషన్ కార్డు హోల్డర్ల అకౌంట్‌లోకి రూ.1500 జమ కాలేదు. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఎవర్ని అడగాలో అర్థం కాని పరిస్థితి. ఈ ఆందోళనను దూరం చేస్తూ తెలంగాణ పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రారంభించింది. 040-23324614 లేదా 040-23324615 లేదా 1967 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ఫోన్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు కొత్త నెంబర్ చెప్తే చాలు. మీ నగదు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులో జమ అయితే ఏ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యాయో వివరాలు చెబుతారు. పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కూడా తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్ లేనివాళ్లు పోస్ట్ ఆఫీసులో నగదు తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి మీ రేషన్ కార్డు కొత్త నెంబర్ చెప్పి, బయోమెట్రిక్ నమోదు చేసి రూ.1500 తీసుకోవచ్చు. నగదు తీసుకోవడానికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళ మాత్రమే వెళ్లాలి.

ఇవి కూడా చదవండి:

రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం... మీకు వచ్చాయో లేదో చెక్ చేయండి ఇలా

Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

SBI account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లాభాలు
Published by: Santhosh Kumar S
First published: April 24, 2020, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading