Home /News /coronavirus-latest-news /

TELANGANA GOVERNMENT TRANSFERRED RS 1500 TO WHITE RATION CARD HOLDERS KNOW HOW TO CHECK STATUS ON EPOS WEBSITE SS

రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం... మీకు వచ్చాయో లేదో చెక్ చేయండి ఇలా

రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం... మీకు వచ్చాయో లేదో చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం... మీకు వచ్చాయో లేదో చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Telangana News | కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నిరుపేద వర్గాలను ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఇలా.

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.1,500 చొప్పున జమ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షల అకౌంట్లలో నగదు జమ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తమ అకౌంట్లలో రూ.1,500 జమ అవుతాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు. మరి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

    ముందుగా https://epos.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    ఎడమవైపు ఉన్న లిస్ట్‌లో DBT Response Status Check పైన క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    అందులో రేషన్ కార్డ్ లేదా యూఐడీ లేదా మొబైల్ నెంబర్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి.
    మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం నెంబర్ ఎంటర్ చేయండి.
    ఆ తర్వాత Get Details పైన క్లిక్ చేయండి.
    ఎవరి అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయో స్టేటస్ తెలుస్తుంది.
    ఒకవేళ Data Not Found అని వస్తే మిగతా రెండు ఆప్షన్స్‌తో ట్రై చేయండి.
    మీరు కూడా నగదు బదిలీ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

    LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే

    PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు