మరో కార్పొరేట్ ఆస్పత్రిపై వేటు వేసిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో కరోనా పేరుతో ప్రజల నుంచి అధిక డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

news18-telugu
Updated: August 4, 2020, 9:40 PM IST
మరో కార్పొరేట్ ఆస్పత్రిపై వేటు వేసిన తెలంగాణ సర్కార్
విరించి హాస్పిటల్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో కరోనా పేరుతో ప్రజల నుంచి అధిక డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని విరించి కార్పొరేట్ ఆస్పత్రిపై వేటు వేసింది. విరించి ఆస్పత్రిలో కరోనా వైద్యం చేసే అనుమతులను రద్దు చేసింది. విరించి హాస్పిటల్‌పై కరోనా పేషెంట్ల నుంచి ఫిర్యాదు వెల్లువలా రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పేషెంట్ల నుంచి రోజుకి రూ. లక్ష చొప్పున విరించి ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేషెంట్ల నుంచి రోజుకి రూ. 10 వేలకు మించి తీసుకోకూడదు. విరించి ఆస్పత్రి బిల్లుల్లో భారీగా తేడాలు ఉన్నట్టు గుర్తించడంతో... తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే ఈ రకమైన ఆరోపణల కారణంగా సోమాజిగూడలోని ది డెక్కన్ ఆస్పత్రిలో కరోనా ట్రీట్మెంట్ సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.
Published by: Kishore Akkaladevi
First published: August 4, 2020, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading