Hyderabad: కరోనా చికిత్స పేరుతో అధిక వసూళ్లు.. ఆ ఆస్పత్రికి సర్కార్ షాక్

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

news18-telugu
Updated: August 3, 2020, 10:01 PM IST
Hyderabad: కరోనా చికిత్స పేరుతో అధిక వసూళ్లు.. ఆ ఆస్పత్రికి సర్కార్ షాక్
ది డెక్కన్ ఆస్పత్రి(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా చికిత్స పేరుతో పలు కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల నుంచి అధిక డబ్బు వసూలు చేస్తుండటంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు బాధితులు ఫిర్యాదు కూడా చేయడంతో విషయం సంచలనం సృష్టించింది. . పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ మేరకు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డెక్కన్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెక్కన్ ఆస్పత్రిపై చర్యల నేపథ్యంలో.. కరోనా పేరుతో దోచుకుంటున్న ఆస్పత్రులపై కేసీఆర్ సర్కార్ చర్యలు మొదలు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై డెక్కన్ ఆస్పత్రిలో కొత్త కరోనా కేసులు అడ్మిట్ చేసుకోవడానికి లేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్లకు ప్రభుత్వం ఆదేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Published by: Kishore Akkaladevi
First published: August 3, 2020, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading