హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు.. సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

Telangana: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు.. సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

పోస్టుల కేటగిరీలు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.

పోస్టుల కేటగిరీలు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Ayushmaan Bharat: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.

  తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ ఆరోగ్యశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

  తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఏప్రిల్‌ తర్వాత అమల్లోకి తెస్తామని అప్పట్లో తెలిపింది. ఈ పథకం ద్వారా 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ కింద 84 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని పేర్కొంది. కేంద్ర పథకం ద్వారా వచ్చే నిధులు తక్కువేనని వెల్లడించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల వైద్య పథకాల కోసం ఏడాదికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించింది.

  మరోవైపు తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో కరోనా చికిత్సను చేర్చినట్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలోనూ చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ తమిళిసైని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఖరీదైన చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. ఈ విమర్శల ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

  ఇక తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం వివరించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి తెలంగాణలో 5,36,766కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 27 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 3,012 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,85,644 మంది రికవరీ అయ్యారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Aarogyasri, Ayushman Bharat Health Scheme, Telangana

  ఉత్తమ కథలు