కరోనా వైరస్ అనుమానితులపై రియల్‌టైమ్‌లో నిఘా పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం 'కోవిడ్-19 మానిటరింగ్ సిస్టమ్' రూపొందించింది. భారతదేశంలోని తొలి హెల్త్ సర్వైలెన్స్ ప్లాట్‌ఫామ్ ఇది. అమెరికాతో పాటు హైదరాబాద్‌లో ఉన్న వెరా స్మార్ట్ హెల్త్‌కేర్ స్టార్టప్ కేవలం మూడు రోజుల్లోనే తయారు చేసిన ఈ యాప్ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు ఆవిష్కరించారు. కరోనా వైరస్ బాధితులను గుర్తించడం, వారిపై రియల్‌టైమ్‌లో నిఘా పెట్టడం, ట్రాక్ చేయడం, పర్యవేక్షించడం, రియల్‌టైమ్ అనలిటిక్స్‌ను ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందజేయడం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాధ్యం. హెల్త్ వర్కర్లు ఈ యాప్ ద్వారా కరోనా లక్షణాలున్నవారు లేదా కోవిడ్ 19 బాధితులకు రోజూ కాంటాక్ట్‌లో ఉండొచ్చు. క్వారెంటైన్‌లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేస్తుంది. సామాజిక దూరాన్ని పాటించడం, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు చెప్పడం కోసం ఈ యాప్‌ను హెల్త్ వర్కర్స్ ఉపయోగించుకోవచ్చు.
ఒక డివైజ్ రోజూ ద్వారా 75 నుంచి 100 ఇళ్లపై నిఘా పెట్టొచ్చు. తెలంగాణలోని 33 జిల్లాల హెల్త్ వర్కర్స్ నెలకు 50,000 కాల్స్/ఛాట్ బాట్ ఇంటరాక్షన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. కోవిడ్-19 పేషెంట్లను, వారి కాంటాక్ట్‌లను జియో ట్యాగ్ చేయడం ద్వారా వారిని ట్రేస్ చేయడం అధికారులకు సులువవుతుంది. 1,500-2,000 మంది ఆశా, ఏఎన్ఎం వర్కర్లు ఈ యాప్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీరు సేకరించే సమాచారం 4,800 ప్రజారోగ్య ఉప కేంద్రాలకు వెళ్తుంది. అటు నుంచి రాష్ట్రంలోని 886 పబ్లిక్ హెల్త్ సెంటర్లకు సమాచారాన్ని పంపిస్తారు. ఆ డేటాను సంబంధిత జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయానికి అప్‌లోడ్ చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Insurance Policy: కరోనాతో చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ
Aadhaar SMS Services: మీ ఇంట్లోంచే ఈ ఆధార్ సేవలు పొందండి
Savings: పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Job notification, JOBS, Mobile App, NOTIFICATION, Telangana, Telangana Government, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu