ఆ మూడు జిల్లాలకు ముగ్గురు ప్రత్యేక అధికారులు

ఆ మూడు జిల్లాలకు ముగ్గురు ప్రత్యేక అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

కొద్దిరోజులుగా సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

 • Share this:
  తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి మూడు జిల్లాలు పెద్ద సవాల్‌గా మారాయి. రాష్ట్రంలోని సగానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటంతో... నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కొంతకాలంగా సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూడు జిల్లాల్లో కరోనా కేసులు వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... అసలు ఈ జిల్లాల్లో వైరస్ వ్యాప్తికి కారణం ఏమిటనే దానిపై ఆరా తీస్తోంది.

  Suryapeta, vikarabad, gadwal, telangana, corona virus, covid 19, cm kcr, సూర్యాపేట, వికారాబాద్, గద్వాల, తెలంగాణ, కరోనా వైరస్, కోవిడ్ 19, సీఎం కేసీఆర్
  మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం


  మరోవైపు ఈ మూడు జిల్లాల్లో పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించింది. వికారాబాద్ జిల్లాకు రజత్ కుమార్, గద్వాల జిల్లాకు రోనాల్డ్ రోస్, సూర్యాపేట జిల్లాకు సర్ఫరాజ్ అహ్మద్‌లను ప్రత్యేక అధికారులకు నియమించిన ప్రభుత్వం... త్వరలోనే వీరి ఈ జిల్లాల్లో పర్యటిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం వీరి తమ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నారు. ఈ ముగ్గురు అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ మూడు జిల్లాల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు