తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి.

news18-telugu
Updated: June 29, 2020, 11:33 PM IST
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్..
టి. పద్మారావు (Image:Facebook)
  • Share this:
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సైతం కరోనా బారినపడ్డారు. ఆయన ఇద్దరు పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేస్తే వీరికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐతే పద్మారావును ఇటీవల ఎవరెవరు కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐతే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి సోకిన రోజే డిప్యూటీ స్పీకర్ కూడా కరోనా బారినపడినట్లు తెలిసింది.

కాగా, తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లకే పరిమితమవుతున్నారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి
First published: June 29, 2020, 11:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading