news18-telugu
Updated: July 7, 2020, 11:14 PM IST
గవర్నర్ తమిళిసైతో సీఎస్, హెల్త్ సెక్రటరీ భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులు, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, ప్రైవేటు ఆసుపత్రుల అధిక బిల్లులు, ప్రభుత్వ వైద్యం అందుతున్న తీరు, జీహెచ్ఎంసీలో అత్యధిక కేసులు నమోదు వంటి అంశాలపై సీఎస్, హెల్త్ సెక్రటరీతో గవర్నర్ చర్చించినట్లు సమాచారం. దీనిపై వారు గవర్నర్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి సోమవారమే రాజ్‌భవన్‌కు రావాలని సీఎస్, ఆరోగ్యశాఖ కార్యదర్శికి గవర్నర్ తమిళిసై వర్తమానం పంపారు. ఐతే సీఎం కేసీఆర్‌తో భేటీ నేపథ్యంలో గవర్నర్‌తో సమావేశాన్ని వారు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అంతకుముందు ఉదయం ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా టెస్ట్‌లు, రోగులకు అందుతున్న చికిత్స, ఫీజుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
July 7, 2020, 8:19 PM IST