గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరవధిక సమ్మె.. రోగులకు మరిన్ని కష్టాలు

తమ జీతాలను రూ.25 వేల వరకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్​ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే జీతాలివ్వాలని...ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 7:06 AM IST
గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరవధిక సమ్మె.. రోగులకు మరిన్ని కష్టాలు
గాంధీ ఆస్పత్రి
  • Share this:
ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. చికిత్సకు అవసరమైన సదుపాయాలు లేవని.. రోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన కోవిడ్ ఆస్పత్రి గాంధీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె బాటపడ్డారు. కాంట్రాక్ట్ నర్సులు ఇప్పటికే 5 రోజులుగా విధులు బహిష్కరించగా.. ఇప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు సైతం సమ్మెకు దిగారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు సీఐటీయూ సభ్యుడు కుమార్ తెలిపారు.

తమ జీతాలను రూ.25 వేల వరకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్​ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే జీతాలివ్వాలని...ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. పీఎఫ్ జమలో ఉన్న అవకతవకలను సరిచేయాలి. సీఎం ప్రకటించిన 10 శాతం కరోనా ఇన్సెంటివ్​లు ఇప్పటి వరకు అందలేదన్న సిబ్బంది.. వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు వరుసగా వారం రోజులు డ్యూటీ చేసిన సిబ్బందికి వారం సెలవు ఇవ్వాలన్నారు. కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్​లు, శానిటైజర్స్​ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

మంగళవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహాన్ని తరలించడంలో ఆలస్యంపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కరోనాతో మరణించిన శ్రీనివాస్ (55) మృతదేహాన్ని 8 గంటలైనా అక్కడి నుంచి తరలించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు .. మృతదేహాన్ని ఈసీజీ తీసేందుకు కొంచెం సమయం పట్టిందని, సరిపడా సిబ్బంది లేనందున మృతదేహం తరలింపులో ఆలస్యం జరిగిందని చెప్పారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే 6 ఐసీయూలు, వార్డులు నిర్వహిస్తున్నాని అన్నారు. మార్చురీకి తరలింపులో ఎనిమిది గంటలు ఆలస్యమైందనే మాటలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading