తెలంగాణలో దిగొచ్చిన కార్పొరేట్ ఆస్పత్రులు.. సంచలన నిర్ణయం...

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరోనా పేషెంట్లకు ఏ చికిత్సకు ఎంత ఫీజు వసూలు  చేయాలో తెలుపుతూ నోట్ విడుదల చేసింది.

news18-telugu
Updated: August 13, 2020, 9:46 PM IST
తెలంగాణలో దిగొచ్చిన కార్పొరేట్ ఆస్పత్రులు.. సంచలన నిర్ణయం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో కార్పొరేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓ వైపు నుంచి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, మరోవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి, ఇంకోవైపు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు.. ప్రతి ఆస్పత్రిలో 50 శాతం బెడ్ ను ప్రభుత్వానికి అందించడానికి అంగీకరించారు. సంక్షోభ సమయంలో వ్యాపారం చేయవద్దని పలు మార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను కోరిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ 50 శాతం బెడ్ ల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు. ఈ బెడ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు చెబుతున్నారు.

ఇటీవల తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల మీద తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కరోనా లేకపోయినా ట్రీట్మెంట్ ఇచ్చింది ఓ ఆస్పత్రి. అలాగే, కరోనా పేషెంట్‌కు 23 లక్షల రూపాయల బిల్లు వేసింది మరో ఆస్పత్రి. కరోనాతో మనిషి చనిపోతే బిల్లు మొత్తం కట్టే వరకు డెడ్ బాడీని అప్పగించబోమని కూడా ప్రకటించింది. దీంతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులు అంటేనే దోపిడీ అనే భయం ప్రజల్లో ఏర్పడేలా వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరోనా పేషెంట్లకు ఏ చికిత్సకు ఎంత ఫీజు వసూలు  చేయాలో తెలుపుతూ నోట్ విడుదల చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆస్పత్రులు డబ్బులు చెల్లించే వారికి మాత్రం బెడ్స్  ఇస్తూ, మిగిలిన వారికి బెడ్స్ ఫుల్ అయిపోయాయని చెప్పి పంపేస్తున్నాయి.  మరోవైపు, ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా ఏ  చికిత్సకు ఎంత ధర వసూలు చేస్తామో తెలిపేలా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, ప్రజలకు కనిపించేలా ఉంచాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా ప్రభుత్వం వద్దకు రావడం
Published by: Ashok Kumar Bonepalli
First published: August 13, 2020, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading