CM KCR: కరోనాపై రోజుకు 3 సార్లు రివ్యూ.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణ సీఎం కేసీఆర్

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  • Share this:
    కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆదేశించారు. రెమిడెసివర్ వంటి అత్యవసర ముందు, వాక్సిన్‌లు, ఆక్సీజన్, ఆస్పత్రిలో పడకల విషయంలో ఏ మాత్రం లోపం రానీయవద్దని, సీఎస్‌ను సీఎం కేసిఆర్ ఆదేశించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

    ప్రస్తుతం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బాధ్యతలను సీఎం కేసీఆరే చూస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో వైద్యఆరోగ్యశాఖను తాను తీసుకున్నారు. సీఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. అనంతరం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులు వెలువడిన వెంటనే కరోనా విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు సీఎం కేసీఆర్. నిత్యం మూడు సమీక్షలు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

    మరోవైపు తెలంగాణలో  కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 7,754 కేసులొచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసులు 4,43,360కి చేరాయి.  శుక్రవారం 6,542 మంది కోలుకున్నారు. తెలంగాణలో మొత్తం రికవరీల సంఖ్య 3,62,160కి చేరింది.  ప్రస్తుతం రికవరీ రేటు 81.68 శాతం ఉంది. రాష్ట్రంలో కొత్తగా 51 మంది మరణించారు. మొత్తం మరణాలు 2312కి చేరాయి. మరణాల రేటు 0.52 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయి. GHMC పరిధిలో కొత్తగా 1507 కేసులొచ్చాయి. తెలంగాణలో కొత్తగా 77,930 కరోనా టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 29 లక్షల 83వేల 784కి చేరింది.
    Published by:Shiva Kumar Addula
    First published: