KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో మొత్తం ముగ్గురికి పాజిటివ్

KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో మొత్తం ముగ్గురికి పాజిటివ్

మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇఫ్పటి వరకు ముగ్గురికి కరోనా రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.ఐతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు పెద్దగా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు.

 • Share this:
  తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముుఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. డాక్టర్ల సలహా మేరకు  ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు.  ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటి వరకు ముగ్గురు కరోనా బారినపడ్డారు. మొదట సీఎం కేసీఆర్.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఇప్పుడు కేటీఆర్‌కు కరోన సోకింది.

  సీఎం కేసీఆర్‌కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం కేసీఆర్‌లో స్వల్ప లక్షణాలు కనిపించడంతో మొదట ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్ధారించుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులోనూ పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు ఏప్రిల్ 21న యశోదా ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేశారు. అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు.

  సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆయన వెంటే ఉన్నారు. ఆ మరుసటి రోజే సంతోష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు ఎలాంటికి లక్షణాలు లేవు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
  సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇఫ్పటి వరకు ముగ్గురికి కరోనా రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.ఐతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు పెద్దగా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు