హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

CM KCR: భయపడకండి.. ధైర్యంగా ఉందాం.. ఎంజీఎంలో కరోనా రోగులకు సీఎం కేసీఆర్ పరామర్శ

CM KCR: భయపడకండి.. ధైర్యంగా ఉందాం.. ఎంజీఎంలో కరోనా రోగులకు సీఎం కేసీఆర్ పరామర్శ

వరంగల్ ఎంజీఎంలో సీఎం కేసీఆర్

వరంగల్ ఎంజీఎంలో సీఎం కేసీఆర్

ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు సీఎం కేసీఆర్. ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. నేరుగా కోవిడ్ ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. అక్కడ కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలో సౌకర్యాల గురించి సీఎం కేసీఆర్ ఆరాతీశారు. కరోనాకు భయపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.

ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు సీఎం కేసీఆర్. ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను గురించి డాక్టర్లతో చర్చించారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సిఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ రమేష్ రెడ్డి, ఓఎస్టీ గంగాధర్, TSMIDCఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండ్ చంద్ర శేఖర్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, సీపీ తరుణ్ జోషి, జిల్లాకు చెందిన పలువురు నేతలు ఉన్నారు.


కాగా, తెలంగాణలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. మే 30 వరకు కఠినమైన ఆంక్షలను విధించారు. ఉదయం 10 తర్వాత ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించడం లేదు. ఇక కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత స్వయంగా ఆరోగ్యశాఖ బాధ్యతలను చూస్తున్నారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి వరుస రివ్యూలు, ఆస్పత్రుల సందర్శనతో బిజీగా ఉన్నారు. బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి.. అక్కడ అందుతున్న చికిత్స, ఆస్పత్రిలో సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఎంజీఎం ఆస్పత్రినీ పరిశీలించారు.

First published:

Tags: CM KCR, Coronavirus, Covid-19, Warangal

ఉత్తమ కథలు