Telangana: కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ప్రకటన చేస్తారా?

Telangana: కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ప్రకటన చేస్తారా?

తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పైగా ప్రజల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడతారని అన్నారు. నైట్ కర్ఫ్యూని మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా వైద్యఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన అధికారులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తాజాగా మరోసారి కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వేతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం కరోనా కట్టది దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని కూడా పరీలించనున్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పైగా ప్రజల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడతారని అన్నారు. నైట్ కర్ఫ్యూని మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మే15 ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. అలాగే వివాహ శుభకార్యాలు, అంత్యక్రియలపైనా ఆంక్షలున్నాయి. పెళ్లిళ్లలో 100 మంది మించకూడదు. అంత్యక్రియలకు కూడా 20 మందికి మించి హాజరుకాకూడదు. స్వీయ నియంత్రణ వల్లే కరోనాను అడ్డుకోగలమని ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

    మరోవైపు తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇంటి వద్దే టెస్ట్ చేసి జ్వరం, ఇతర కరోనా లక్షణాలు ఉంటే కరోనా కిట్ అందజేస్తున్నారు. టెస్ట్‌ల పేరుతో ప్రజలు కాలయాపన చేయకూడదని.. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా ప్రభుత్వం సూచించిన మందులు వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మందుల జాబితాను విడుదల చేసింది. సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితకంగానే ఇస్తారని.. లేదంటే మెడికల్ షాపుల్లో కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో వ్యాక్సిన్ కొరత నెలకొంది. మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. వారికి ఇప్పట్లో టీకా ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మొదటి డోసు తీసుకున్న వారికి.. రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.


    తెలంగాణలో శనివారం 5186 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ7994 మంది కోవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా.. 38 మరణించారు. ఇవాళ్టి కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. ఇప్పటి వరకు 4,21,219 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 2704 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 68, 462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. ఇప్పటి వరకు 4,21,219 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 2704 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 68, 462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు