Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    #SpeakUpTelangana | కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ డిజిటల్ ఉద్యమం.. డిమాండ్లు ఇవే..

    కరోనా ట్రీట్ మెంట్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

    news18-telugu
    Updated: July 18, 2020, 5:06 PM IST
    #SpeakUpTelangana | కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ డిజిటల్ ఉద్యమం.. డిమాండ్లు ఇవే..
    Speakup Telangana
    • Share this:
    తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. #SpeakUpTelangana పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. #SpeakUpTelangana హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రజా సమస్యలు, ముఖ్యంగా ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజులను నియంత్రించి, 50శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, అన్ని జిల్లా కేంద్రాల్లోని హోటల్స్ లో 50 శాతం రూమ్ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్ లకు ఆ రూమ్ లను ఉపయోగించాలని సూచించారు. ‘రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలి. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచాలి. ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలి. కరోనా కు మందు వచ్చే వరకు ప్రజలకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి. కిరాయిదారుల ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలి. ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేయాలి. గాంధీ హాస్పిటల్ కు రూ.3000కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలి.’ అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

    హార్ట్ అటాక్ వంటి ఇబ్బందులతో హాస్పిటల్ కు వెళ్లిన వారికి కూడా కరోనా అనుమానం తో వైద్యం చేయడం లేదని జగ్గారెడ్డి చెప్పారు. దాంతో కరోనాయేతర అనారోగ్య సమస్యలతో వెళుతున్న వారికి వైద్యం సకాలంలో అందక మరణిస్తున్నారు. ప్రజలంతా మరణిస్తే ప్రాజెక్టులు కట్టినా ఉపయోగం లేదని సీఎం కేసీఆర్‌కు సూచించారు.

    తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,496 కోవిడ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 2,37,817 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 28,705 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో 17,081 (ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ కలిపి) బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 1,793 బెడ్స్ నిండాయి. 15,288 బెడ్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి.
    Published by: Ashok Kumar Bonepalli
    First published: July 18, 2020, 5:05 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading