హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

లాక్‌డౌన్‌, వ్యవసాయంపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష..

లాక్‌డౌన్‌, వ్యవసాయంపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావును ఆదేశించారు.

లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటం, వానాకాలం వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటం, వానాకాలం వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కరోనాపై తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగిస్తున్న సరి, బేసి విధానాన్ని అలాగే కొనసాగించాలా? ఏవైనా మార్పులు చేయాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. వానాకాలం సమీపిస్తుండటంతో నియంత్రిత వ్యవసాయం, ఎరువుల లభ్యత, విత్తనాల అందుబాటుపైనా సీఎం సమీక్ష చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఎలా జరపాలన్న దానిపైనా చర్చించనున్నారు.

First published:

Tags: CM KCR, Coronavirus, Lockdown, Telangana News

ఉత్తమ కథలు