తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. సీఎం కేసీఆర్ మరో కఠిన నిర్ణయం..?

కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా ప్రజలు పట్టించుకోకపోవడం, లాక్‌డౌన్ విధించినా ప్రజలు రోడ్ల మీదకు వస్తుండటం పట్ల సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 27, 2020, 7:50 AM IST
తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. సీఎం కేసీఆర్ మరో కఠిన నిర్ణయం..?
తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య 45కు చేరుకుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నా ప్రజలు పట్టించుకోకపోవడం, లాక్‌డౌన్ విధించినా ప్రజలు రోడ్ల మీదకు వస్తుండటం పట్ల సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం నాడు.. ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. జనాలు ఎక్కువగా బయట తిరితే కరోనాను కట్టడి చేయడం అసాధ్యమని, కర్ఫ్యూ, లాక్ డౌన్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.

కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్చి 31 వరకే కర్ఫ్యూను అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు కరోనా కేసులు మరిన్ని పెరుగుతున్నందున రాత్రి పూట కర్ఫ్యూను ఏప్రిల్ 14 వరకు కొనసాగించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. లేకపోతే, ఏప్రిల్ 16 వరకు కర్ఫ్యూతో పాటు.. లాక్‌డౌన్ కూడా కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు