మళ్లీ రిపీట్ కావొద్దు.. సీఎంలు కేసీఆర్ , జగన్ నిర్ణయం..

జగ్గయ్యపేట వ్యవహారంపై స్వయంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కోవిడ్‌-19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని వీరు నిర్ణయించారు.

news18-telugu
Updated: March 26, 2020, 6:20 AM IST
మళ్లీ రిపీట్ కావొద్దు.. సీఎంలు కేసీఆర్ , జగన్ నిర్ణయం..
వైఎస్ జగన్, కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నా దాదాపు వెయ్యి మంది ఏపీ ఉద్యోగులు, విద్యార్థులు ఏపీకి పయనమయ్యారు. హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసేస్తున్నారన్న కారణంతో వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. వారంతా హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఎన్‌వోసీలతో జగ్గయ్యపేట ప్రాంత్రంలోని ఏపీ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరందర్నీ ఏపీలోకి అనుమతించకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరికి తెలుగు రాష్ట్రాల సీఎంల జోక్యంతో హెల్త్ ప్రొటోకాల్ పాటిస్తూ ప్రత్యేక బస్సుల ద్వారా వారిని వైద్య పరీక్షల కోసం క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు పంపారు. పశ్చిమ గోదావరికి చెందిన వాళ్లను తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలించారు.

అయితే, జగ్గయ్యపేట వ్యవహారంపై స్వయంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కోవిడ్‌-19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని వీరు నిర్ణయించారు. జగ్గయ్యపేట వద్ద ఉన్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇరువురు నిర్ణయించారు. అటు.. హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని ఏపీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలా చేస్తే వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టినట్టే అవుతుందని చెబుతున్నారు. అటు.. హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయవద్దంటూ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు