Telangana: తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ: భట్టి విక్రమార్క డిమాండ్ 

Bhatti Vikramarka: ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ గార్డ్ తో నెట్టి వేయించే పరిస్థితి నెలకొందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

news18-telugu
Updated: August 28, 2020, 10:48 PM IST
Telangana: తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ: భట్టి విక్రమార్క డిమాండ్ 
నిజామాబాద్‌లో జిల్లా ఆస్పత్రిని సందర్శించిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నాయకులు
  • Share this:
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో క‌రోనా బాదితుల‌ పరిస్థితి  చాలా దారుణంగా ఉందని సీఎల్పీ నేత బ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ప్రజా వైద్యం పైన సీఎం కేసీఆర్ కు ప‌ట్టింపు లేద‌ని అయ‌న దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ పాలనలో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి లేదన్నారు. ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ గార్డ్ తో నెట్టి వేయించే పరిస్థితి నెలకొందన్నారు. నిజామాబాద్ జిల్లాకు వ‌చ్చి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు సీఎల్పీ నేత‌ బ‌ట్టి విక్ర‌మార్క జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోవిడ్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.. భట్టి తో పాటు జిల్లా అధ్యక్షుడు మానాల మోహ‌న్ రెడ్డి, మాజీ విఫ్ అనీల్, జిల్లా నాయ‌కులు  ఉన్నారు.. ఆనంత‌రం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్క‌రి మ‌ర‌ణానికి కేసీఆర్ కార‌ణం అని అయ‌న అరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందన్నారు.  ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఐసొలేషన్ ఏర్పాటు చెయ్యాలన్నారు. కరోనాతో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేసారు.. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సరైన వైద్యం అందించెందుకు కృషి చేయాలన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 28, 2020, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading