తెలంగాణ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం.. బీజేపీ మండిపాటు

సీఎం కేసీఆర్

తెలంగాణలో కోవిడ్ 19 కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

  • Share this:
    కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు అన్నారు. దేశం మొత్తంలో ఇన్ఫెక్షన్ రేటు, మరణాల రేటు తెలంగాణలో ఎక్కువ ఉండటానికి ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రుల నిర్లక్ష్యపూరిత, గర్హనీయ వైఖరే కారణమన్నారు. ఆరోగ్య సేతు సమాచారంతో, ఇన్ఫెక్షన్ రేటు, క్వారంటైన్లో ఉన్నవారిలో పాజిటివ్ శాతం ఆధారంగా ఇండియాన్ ఇన్ పిక్సెల్స్ సంస్థ విడుదల చేసిన లెక్కల్లో కమ్యూనిటీ ట్రాన్సఫర్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. 143 శాతం కమ్యూనిటీ ట్రాన్సఫర్ తో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. వేగంగా జరుగుతోన్న కోవిడ్ 19 కమ్యూనిటీ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలేంటో సీఎం కేసీఆర్, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త కేసుల నమోదు ఇలాగే కొనసాగుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి మార్చుకోకపోతే, తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ప్రజారోగ్య విపత్తులోకి జారుకుంటుందన్నారు. తెలంగాణలో కోవిడ్ 19 కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి, ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకుని, తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

    తెలంగాణలో ప్రభుత్వం మంగళవారం రాత్రి  జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,109 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 3,006 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,217 మందికి నెగెటివ్ వచ్చింది. 879 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 63,249 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
    First published: