హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: కరోనా ఎలా ఉంది.. ఈటలను అడిగిన ఎమ్మెల్యేలు.. నివేదిక కోరిన మంత్రి

Telangana: కరోనా ఎలా ఉంది.. ఈటలను అడిగిన ఎమ్మెల్యేలు.. నివేదిక కోరిన మంత్రి

మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

Telangana: కరోనా బాధితులకు అందించే చికిత్సకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు.

  కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఆరా తీశారు. అసెంబ్లీలో తన ఛాంబర్ నుండి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్య అసోసియేషన్‌లతో మంత్రి ఈటల ఫోన్‌లో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. అయితే కరోనా తీవ్రత పెద్దగా లేదని మంత్రి ఈటలకు అధికారులకు వివరించారు. అయితే కరోనా బాధితులకు అందించే చికిత్సకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ వారిని ఆదేశించారు. పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు.

  కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి కోరారు. తదనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మాజీ శాససభ్యులకు వైద్య ఖర్చులు ఇచ్చేందుకు, పెన్షన్లు పెంచేందుకు చొరవ తీసుకున్నందుకు మంత్రి ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు చికిత్సకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

  శాసన సభ్యులు, వారి భార్యకు లేదా భర్తకు అవసరమైన చికిత్స కోసం పది లక్షలు ఖర్చు చేసేలా బిల్లు రూపొందించడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో చికిత్స తీసుకునే విధంగా శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు వారి భార్య లేదా భర్తకు ఇది వర్తిస్తుందని అన్నారు. మాజీ శాసన సభ్యులకు సంబంధించిన కనీస పెన్షన్ 30 వేల నుంచి 50 వేల వరకు అప్పర్ సీలింగ్ 75 వేల వరకు ఈ బిల్లులో పెట్టారు. మంత్రీ ఈటలను కలిసిన రాజేశం గౌడ్, ఆంజనేయులు, లింగయ్య, గుజ్జుల రామకృష్ణరెడ్డి, సుద్దాల దేవయ్య తదితరులు ఉన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Etela rajender, Telangana

  ఉత్తమ కథలు