Home /News /coronavirus-latest-news /

TELANAGANA HEALTH MINISTER ANNOUNCED FREE CORONA TEST CENTRES IN HYDERABAD SK

హైదరాబాద్‌లో ఉచితంగా కరోనా పరీక్షలు చేసే 11 కేంద్రాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 8,082 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 267 మంది మరణించారు.

    తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఐతే రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే వస్తున్నాయి. 70శాతం పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టెస్ట్‌ల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. హైదరాబాద్‌లో 11 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత కరోనా పరీక్షలు చేస్తోంది. ఆ కరోనా పరీక్షల కేంద్రాల వివరాలను తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

    తెలంగాణలో ఉచిత కరోనా పరీక్షా కేంద్రాలు:
    1. కింగ్ కోఠి హాస్పిటల్, కోఠి.
    2. ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట
    3. చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ
    4. నేచర్ క్యూర్ హాస్పిటల్, అమీర్ పేట్
    5. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం
    6. ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఎర్రగడ్డ
    7. హోమియోపతి హాస్పిటల్, రామంతాపూర్
    8. నిజామియా టిబ్బీ హాస్పిటల్, చార్మినార్
    9. ఏరియా హాస్పిటల్, కొండాపూర్
    10. ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం
    11. ఈఎస్ఐ హాస్పిటల్, నాచారం

    కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 8,082 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవగా.. 267 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 4,234 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 3,216 మందికి నెగెటివ్ వచ్చింది. మరో 1,018 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 92,797 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.
    First published:

    Tags: Coronavirus, Covid-19, GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు