Breaking News: పాండ్యాకు కరోనా పాజిటివ్.. ఇండియా శ్రీలంక టీ20 మ్యాచ్ వాయిదా

కృనాల్ పాండ్యా (ఫైల్ ఫోటో)

Krunal Pandya Tested Covid 19: మిగతా ఆటగాళ్లందరికీ కరోనా టెస్టుల్లో నెగిటివ్ అని తేలితేనే రేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉందని.. లేకపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని తెలిస్తోంది.

  • Share this:
    ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. క్రికెట్‌కు కరోనా అడ్డంకులు తొలగడం లేదు. తాజాగా శ్రీలంక టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇరు జట్లు ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో నేడు జరగాల్సిన ఇండియా శ్రీలంక రెండో టీ20 మ్యాచ్‌ వాయిదా పడింది. మిగతా ఆటగాళ్లందరికీ కరోనా టెస్టుల్లో నెగిటివ్ అని తేలితేనే రేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉందని.. లేకపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.

    ఇప్పటికే లంక గడ్డపై శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గత ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌‌ను గెలుచుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్‌ను కూడా గెలుచుకుని మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌ను సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది.

    ఈ క్రమంలోనే టీమిండియా సభ్యుడు కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో నేడు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు. మిగతా ఆటగాళ్లందరికీ పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలితేనే రేపు ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న నేపథ్యంలో.. రెండో టి20 జరిగే పరిస్థితులు ఉంటాయా ? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: