Chandrababu Naidu: ఏపీలో ప్రమాదకరమైన కరోనా వైరస్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు

Chandrababu Naidu: కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిందని చంద్రబాబు అన్నారు.

  • Share this:
    ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే అత్యంత ప్రమాదకరమైనదని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్‌లైన్ ద్వారా సమావేశమైన చంద్రబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని వ్యాఖ్యానించారు. కరోనాకు చెందిన ఇతర వైరస్‌ల కంటే కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

    కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిందని చంద్రబాబు అన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్న చంద్రబాబు.. ఈ విషయంలో జగన్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న టీడీపీ అధినేత.. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని సూచించారు.

    మరోవైపు టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి మృతికి చంద్రబాబు పట్ల సంతాపం ప్రకటించారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సబ్బంహరి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలతో తనలాంటి వారికి మార్గదర్శకులుగా నిలిచారని లోకేశ్ పేర్కొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: