Andhra Pradesh: కర్ఫ్యూ కాదు లాక్ డౌనే కరోనా కట్టడికి ప్రధాన మార్గం.. ఏపీ ప్రభుత్వం ఆలోచన చేయాలన్న చంద్రబాబు

Andhra Pradesh: కర్ఫ్యూ కాదు లాక్ డౌనే కరోనా కట్టడికి ప్రధాన మార్గం.. ఏపీ ప్రభుత్వం ఆలోచన చేయాలన్న చంద్రబాబు

ఏపీలో లాక్ డౌన్ పెట్టాలి

ఏపీలో కరోనా కట్టడికి మార్గం ఏంటి? నైట్ కర్ఫ్యా వర్కౌట్ కాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో పగటి కర్ఫ్యూ ఫలితాలు ఇస్తుందని ఆశించడం కష్టమే. మరి ఇలాంటి సమయంలో కరోనాను పూర్తిగా నియంత్రించడం ఎలా? అంటే లాక్ డౌన్ ఒక్కటే ఫైనల్ అస్త్రం అనే వాదన వినిపిస్తోంది.

 • Share this:
  ఏపీ (Andhra Pradesh)ని కరోనా వైరస్ (Corona Virus) వెంటాడుతోంది. ప్రతి రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా ఏపీలో భయంకరమైన వైరస్ ఉందనే వార్తలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఏపీలో ఉన్నది ఎన్ 440 కె వైరస్ అని కొందరంటే.. కాదు డబుల్ మ్యూటెంట్ కొత్తరకం స్ట్రైన్ అని మరికొందరు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అసలు అంత భయపడాల్సిన అవసరం లేదంటోంది. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పెరుగుతున్న కేసులు, మరణాల కారణంగా వెంటనే లాక్‌డౌన్‌ విధించాలని చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) డిమాండ్ చేశారు.

  ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు అందచేయాలన్నారు కోరారు. ఆర్థికంగా చితికిపోయిన వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా పరిగణించాలని కోరారు. కర్ఫ్యూ పెట్టి నిత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఉదయం 6 గంటలకే మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఏపీలోనే కాదు దేశమంతా లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

  ఇదీ చదవండి: నా మాట విన్నందుకు కృతజ్ఞతలు.. ఇదీ కూడా చేయండి అంటూ జగన్ కు లోకేష్ లేఖ

  అలాగే వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని చంద్రబాబు గుర్తు చేశారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం మాట్లాడుతోందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితి దారుణంగా ఉంది. ఆక్సిజన్ అందక చాలా మంది మరణిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. అందుకే ప్రభుత్వ వైఖరితో బాధ కలిగే తాను పొలిట్‌బ్యూరో సమావేశం పెట్టామను అన్నారు. కరోనా పరిస్థితుల పై కేబినెట్ భేటీ పెట్టి.. కానీ అతి తీవ్రమైన కరోనాకు కేబినెట్ భేటీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అన్నారు చంద్రబాబు.

  ఇదీ చదవండి: చెక్ పోస్టు పడ్డాది రమణా.. ఏపీకి వచ్చే వారికి అలర్ట్... బోర్డర్ దగ్గర పడిగాపులు

  కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, కరోనా రోగులకు తమ పార్టీ తరపున సాయం అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని, దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని చంద్రబాబు వెల్లడించారు.
  Published by:Nagesh Paina
  First published: