HOME »NEWS »Corona vilayatandavam »tdp mlc bachula arjunudu affected to coronavirus second time ba gnt

TDP MLC Corona second time: టీడీపీ ఎమ్మెల్సీకి రెండోసారి కరోనా, ఊపిరి అందక ఇబ్బంది

TDP MLC Corona second time: టీడీపీ ఎమ్మెల్సీకి రెండోసారి కరోనా, ఊపిరి అందక ఇబ్బంది
టీడీపీ

బచ్చుల అర్జునుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. గతంలో ఓ సారి కరోనా సోకింది. అది తగ్గింది. ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. కొద్దిరోజుల క్రితం కరోనా రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరారు బచ్చుల అర్జునుడు. కరోనా నెగెటివ్ వచ్చాక డిశ్చార్జ్ అయ్యారు. బచ్చుల అర్జునుడుకి మరోసారి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‍కు తరలించే ఏర్పాటు చేశారు. బచ్చుల అర్జునుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

    మరోవైపు ఏపీలో గడిచిన 24 గంటల్లో 664 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు 8,70,076 కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 856320 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 7014 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో 24 గంటల్లో 63049 కరోనా పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,02,29,745 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో 24 గంటల్లో 835 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 03, 2020, 18:55 IST