Covid Vaccine : కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో టీడీపీ ఎమ్మెల్యే దంపతులు.. ఆ ఘనత వారిదే..!

Covid Vaccine : కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో టీడీపీ ఎమ్మెల్యే దంపతులు.. ఆ ఘనత వారిదే..!

ప్రతీకాత్మక చిత్రం

కృష్ణాజిల్లా, విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా టీకా వేయించుకున్నారు.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్యిన్ పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. కొన్ని పరిశోధనలు ఆరంభంలోనే ఉండగా.. మరికొన్ని చివరి దశకు వచ్చేశాయి. మరికొన్ని వారాల్లో వ్యాక్సిన్ వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రయోగాలను చివరి దశకు తీసుకొచ్చింది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాక్సిన్ ను వాలంటీర్లపై ప్రయోగిస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఇంతవరకూ ప్రముఖ వ్యక్తులెవరూ పాల్గొనలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎమ్మెల్యే దంపతులు వ్యాక్సిన్ వాలంటీర్లుగా మారారు. కృష్ణాజిల్లా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్నారు.

    TDP MLA becomes Covid vaccine Volunteer
    TDP MLA becomes Covid vaccine Volunteer


    ఇటీవలే గద్దె రామ్మోహన్ దంపతులు గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి వీరిని భారత్ బయోటెక్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతి నెల మొదటివారంలో వీరికి వ్యాక్సిన్ ఇస్తారు. కొవిడ్ వ్యాక్సిన్ లో పాల్గొనేలా ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు ఎమ్మెల్యే దంపతులు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. స్వతహాగా ఉన్నత విద్యావంతుడైన గద్దె రామ్మోహన్ ఈ ట్రయల్స్ లో పాల్గొని కొవిడ్ పై యుద్ధంలో తాను కూడా భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో రాజకీయ ప్రజాప్రతినిథులు పాల్గొవడం ఇదే తొలిసారి.

    ఎక్కువ మంది వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొంటే త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశముందని గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రెగ్యులర్ గా టీకా వేయించుకుంటామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో గద్దె రామ్మోహన్ దంపతులు విజయవాడలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మాస్కులు, శానిటైజర్లు, మందులు, ఆహారం పంపిణీ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు