హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా వ్యాప్తికి చెక్... నారా లోకేశ్ చిట్కా

కరోనా వ్యాప్తికి చెక్... నారా లోకేశ్ చిట్కా

నారా లోకేష్

నారా లోకేష్

Nara Lokesh: కరోనా వ్యాప్తిని అరికట్టే మరో చిట్కాను ట్విట్టర్ ద్వారా వివరించారు టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్.

  కరోనా వ్యాప్తిని అరికట్టడం ఎలా అనే అంశంపై ఎవరికి తోచిన చిట్కాలు వారు చెబుతున్నారు. లాక్ డౌన్‌ను పాటిస్తూ... ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. తాజాగా కరోనా వ్యాప్తిని అరికట్టే మరో చిట్కాను ట్విట్టర్ ద్వారా వివరించారు టీడీపీ యువనేత, మాజీమంత్రి నారా లోకేశ్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడమే అని నారా లోకేశ్ వివరించారు.


  మీది కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయ్యాలని నారా లోకశ్ సూచించారు. అలా చేయడం ద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుందని తెలిపారు. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందని తెలిపారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే అని... రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని నారా లోకేశ్ వివరించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Nara Lokesh

  ఉత్తమ కథలు