హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు వద్దు... కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం కోరుతూ లోకేష్ లేఖ

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు వద్దు... కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం కోరుతూ లోకేష్ లేఖ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

ఏపీలో పది పరీక్షలు ఉంటాయా? ఉండవా తేల్చుకోలేక విద్యార్థులు తీవ్ర సతమవవుతున్నారు. ఏపీ ప్రభుత్వం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేదు. ఇలాంటి సమయంలో ఏపీలో పది పరీక్షలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటారా..?

ఇంకా చదవండి ...

ఏపీలో పదవ తరగతి పరీక్షల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలుపెరుగుని పోరాటం చేస్తున్నారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. రాష్ట్రం ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ కు పలుమార్లు లేఖలు రాసిన ఆయన.. ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలను వ్యతిరేకిస్తూ లోకేష్ పోరాటానికి మద్దతు తెలిపారు.. అయినా రాష్ట్రం ప్రభుత్వం మాత్రం పరీక్షల విషయంలో ముందుకే వెళ్తోంది. జూన్ 7వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు.. దీంతో నారా లోకేష్ తన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు..

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. చాలా రాష్ట్రాల్లో ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ బోర్టులు పరీక్షలు రద్దు చేశాయన్నారు. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 7వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆ లేఖలో రాశారు..

ఇదీ చదవండి: ఏపీకి రిలయన్స్ సాయం... ముఖేష్ అంబానీకి సీఎం జగన్ థాంక్స్...

ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షల పట్ల అయోమయంలో ఉన్నారని, కరోనా ఉధృతిలో విద్యార్థుల ప్రాణాలు ఫణంగా పెట్టడం సరైన పద్దతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పరీక్షలు వద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి.. అభ్యర్థనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని.. ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్‌ ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో కలుగుజేసుకొని విద్యార్థుల ప్రాణాలక రక్షణ కల్పించాలని లోకేష్ కోరారు.

ఇదీ చదవండి: ఆనందయ్య మందు ధర 20 వేల రూపాయలా..? హానికరం కాదని తేలడంతో ఫుల్ డిమాండ్...

అంతకుముందు ఇంటర్మీడియన్ పరీక్షల విషయంలోనూ లోకేష్ తీవ్రంగా పోరాటం చేశారు. మే 5న పరీక్షలు జరగాల్సి ఉండగా.. హైకోర్టు జోక్యంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పదో తరగతి పరీక్షల విషయంలోనూ న్యాయమే గెలుస్తుందని లోకేష్ భావిస్తున్నారు. అందుకే పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పదే పదే కోరుతున్నారు...

ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా..? బయట నుంచి ఏపీకి వస్తున్నారా..? ఇలా చేయండి.. కొత్త నిబంధనలు ఇవే

మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ పది పరిక్షలు నిర్వహించి తీరుతామంటోంది. విద్యార్థుల భవిష్యత్తుకోసమే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని జగన్ సర్కార్ వాధిస్తోంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావాలన్నా.. ఉన్నత చదువులు చదవాలన్న పదవ తరగతి మార్కులే ప్రాతిపదికగా తీసుకుంటారని.. ఏదో పాస్ అని సర్టిఫికేట్ మీద రాసి ఇస్తే ఎలా అని సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ ప్రశ్నిస్తున్నారు. విపక్షాల వాదనలో అర్థం లేదని పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం.

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, Ap government, AP News, Nara Lokesh, Ssc exams

ఉత్తమ కథలు