Jr. NTR: తారక్ జాగ్రత్త... జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు... ఏమైందంటే

జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండు

జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారా..? ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందా? వరుస ఎన్నికల ఓటముల తరువాత పార్టీకి తారక్ విలువ తెలిసి వచ్చిందా? ప్రస్తుతం ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • Share this:
    ఏపీలో టీడీపీ భవిష్యత్తు ఏంటి..? వరుస ఎన్నికల ఫలితాల తరువాత అందరిలో మొదలైన అనుమానం ఇదే..  బయట వ్యక్తులు,, అభిమానులు, కార్యకర్తలు మాత్రమే కాదు.. పార్టీ నేతలు సైతం తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు అందులో ఎంతమంది అధినేత వెంట ఉన్నారు అన్నది సమాధానం లేని ప్రశ్నే.. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ ఊరట కలిగించే ఫలితం రాలేదు. పంచాయతీ ఎన్నికలో పరాజయాలు వెంటాడాయి.  మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర భంగపాటు తప్పలేదు. భారీ ఆశలు పెట్టుకున్న తిరుపతి ఉప ఎన్నికలోనూ ఓటమి ఎదురైంది.  దీంతో టీడీపీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం చర్చనీయాంశగా  మారింది.  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  స్వయంగా లోకేష్ ను తిడుతూ మాట్లాడిన వీడియో ఆ మధ్య లీకయ్యంది కూడా..

    ఏపీలో టీడీపీ  మళ్లీ పుంజుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకురావాలనే డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది. సోషల్ మీడియాలోనో.. ఇతర మీడియాల్లోనో  కాదు.. టీడీపీ అంతర్గత సమావేశాల్లోనూ ఈ డిమాండ్ వినిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేతలు సైతం ఇదే మాట చెబుతున్నారు. అధినేత చంద్రబాబు ముందే ఈ వాదనను తెరపైకి తెస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగింది. ఎవరి డిమాండ్ ఎలా ఉన్నా.. జూనియర్ ప్రస్థావన మాత్రం చంద్రబాబు ఎప్పుడు ఎక్కడా తీసుకురావడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారా? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

    ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. అయితే తాను  క్షేమంగానే ఉన్నాను అంటూ తారక్ ట్వీట్ చేశారు. తాజాగా చంద్రబాబు ఎన్టీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. తారక్ జాగ్రత్తగా ఉండు.. త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండింగ్ గా మారింది. ఇంతకాలం జూనియర్ ఎన్టీఆర్  కష్ట సుఖాలను పట్టించుకోని చంద్రబాబు.. ట్వీట్ వెనకాల వేరే ఉద్దేశం ఉంది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు..

    జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలి అనుకుంటున్నారని.. అందుకే ఇలా ప్రేమ కురిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ ప్రస్తావనే తీసుకురాని చంద్రబాబు ఇలా ట్వీట్ చేయడానికి అదే కారణమంటున్నారు. టీడీపికి వరుస పరాజయాలు ఎదురవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేవలం ట్వీట్ చేయడమే కాదు.. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు -జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని.. ఆ గ్యాప్ ను కరోనా చెరిపేస్తోందని అంటున్నారు. మరోవైపు కొంతమంది అభిమానులు మాత్రం.. ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: