కేంద్ర కరోనా నిధులు దుర్వినియోగం..జగన్ సర్కారుపై టీడీపీ ఆరోపణ

కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల వ్యయంపై జగన్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇందు కోసం కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రూ.8000 కోట్లు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 13, 2020, 7:56 AM IST
కేంద్ర కరోనా నిధులు దుర్వినియోగం..జగన్ సర్కారుపై టీడీపీ ఆరోపణ
కరోనా పేషెంట్ మృతదేహం రిక్షాలో తరలింపు
  • Share this:
కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల వ్యయంపై జగన్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇందు కోసం కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రూ.8000 కోట్లు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన కరోనా నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. కరోనా విజృంభిస్తున్నా...ముందస్తుగా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో జగన్ సర్కారుకు ముందుచూపు కొరవడిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన చికిత్స అందక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు.  ముందుచూపుతో ప్రభుత్వం వ్యవహరించి ఉంటే నేడు ఈ దుస్థితి ఏర్పడేది కాదన్నారు. ప్రజల ప్రాణాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని యనమల దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.క్వారెంటైన్ సెంటర్లలో కరోనా రోగులకు తగిన భోజనాన్ని అందించడం లేదని, మరి దీనికి కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు.

కొత్త పారిశ్రామిక విధానంలో పసలేదు..యనమల
అటు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పారిశ్రామిక విధానం 2020-23పై యనమల పెదవి విరిచారు. రాష్ట్రంలో కుదేలైన పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు దోహదపడేవి ఏవీ కొత్త పారిశ్రామిక విధానంలో లేవన్నారు. అలాగే ఈ పారిశ్రామిక విధానంతో నిరుద్యోగులకు కొత్తగా ఉపాధి అవకాశాలుసృష్టించే అవకాశమే లేదన్నారు.  ప్రభుత్వ విధానాల కారణంగానే రాష్ట్రంలో నిర్మాణం, ఉత్పత్తి, రియల్ ఎస్టేట్, ఫార్మా తదితర రంగాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. గత 14 మాసాల కాలంలో ఏపీలో పారిశ్రామిక వృద్ధిరేటు నెగటివ్‌లోకి(-2.2 శాతం) జారుకుందని విమర్శించారు.
Published by: Janardhan V
First published: August 13, 2020, 7:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading