పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్...

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఒమర్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు.

news18-telugu
Updated: May 24, 2020, 6:10 PM IST
పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్...
తౌఫిక్ ఒమర్ (Image Credit : @ddsportschannel)
  • Share this:
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఒమర్‌ కరోనా వైరస్ బారిన పడ్డారు. జ్వరం రావడంతో అతడు తనంతట తాను ఆస్పత్రికి వెళ్లి కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడికి పెద్దగా కరోనా లక్షణాలు కూడా కనిపించలేదు. ఓసారి మంచిదని చెక్ చేయించుకుంటే పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. ‘నిన్న రాత్రి జ్వరం వచ్చింది. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. అందులో పాజిటివ్ వచ్చింది. ’ అని తౌఫీక్ ఒమర్ జియో న్యూస్‌కు తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాను త్వరగా కోలుకోవాడానికి అభిమానులు ప్రార్థించాలని కోరాడు. పాకిస్తాన్‌లో కొందరు ఫుట్ బాల్ ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. అయితే, తౌఫీక్ ఒమర్‌ తొలి హై ప్రొఫైల్ క్రికెటర్. తౌఫీక్ ఒమర్ 2001లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. 44 టెస్టులు, 22 వన్డేలు ఆడాడు. సుమారు 13 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. పాకిస్తాన్ ఓపెనర్‌గా కూడా సేవలు అందించాడు. టెస్ట్ క్రికెట్‌లో 2963 పరుగులు చేశఆడు. వన్డేల్లో 504 రన్స్ చేశాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 24, 2020, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading