news18-telugu
Updated: November 9, 2020, 5:00 PM IST
ప్రతీకాత్మక చిత్రం
Tata Medical and Diagnostics- TataMD: దేశంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. అటు కరోనా బలహీన పడింది అనే ఉద్దేశంతో ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. అటు వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యా గణనీయం గా తగ్గిపోయింది. కొన్ని కరోనా కిట్ లతో చేసిన పరీక్షలలో సరి అయినా ఫలితం తెలియకపోవడం కూడా వ్యాప్తి పెరగడానికి ఒక కారణం. ఈ సమస్య ను నివారించడానికి టాటా సంస్థ కరోనా కిట్స్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టనుంది. తాజాగా టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్- టాటా గ్రూప్ హెల్త్‌కేర్ యూనిట్ టాటాఎండి సోమవారం 90 నిమిషాల్లో కరోనాను సులభంగా కనుగొనే COVID-19 టెస్ట్ కిట్‌ను విడుదల చేసింది. సులభంగా వైరస్‌లను గుర్తించగల సామర్థ్యం ఈ టెస్ట్ కిట్ సొంతం. అలాగే ఈ టెస్ట్ కిట్‌తో, కరోనా వైరస్ పరీక్ష ఫలితం 90 నిమిషాల్లో వస్తుంది. దేశంలో కరోనాను పెద్ద ఎత్తున పరీక్షించడానికి ఇది సహాయపడుతుంది. టాటా చెన్నై ప్లాంట్‌లో టెస్ట్ కిట్ తయారు చేశారు. టాటా గ్రూప్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సహకారంతో క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటరప్టెడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ కరోనా వైరస్ టెస్ట్ (CRISPR కరోనా టెస్ట్) తో ఈ కిట్‌ను రూపొందించారు. కాగా ఈ కిట్ ను వాడటాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. కాగా ఈ కొత్త కిట్ కు ఫెలుడా అని నామకరణం చేసారు. ప్రతి నెలా 1 మిలియన్ టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేస్తుంది.
టాటాఎండి సీఈఓ గిరీష్ కృష్ణమూర్తి మాట్లాడుతూ త్వరలోనే ఈ టెస్ట్ కిట్ డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, ల్యాబ్‌లలో లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కరోనా టెస్ట్ కిట్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ భాగస్వామ్యం ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లతో చర్చలు జరుపుతోందని. ఈ టెస్ట్ కిట్‌కు భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించింది.
ఇదిలా ఉంటే దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు 85.5 లక్షలు దాటి, మరణాల సంఖ్య 1,26,611 కు చేరుకున్న సమయంలో టాటా గ్రూప్ ఈ టెస్ట్ కిట్‌ను ప్రారంభించింది. అంతకుముందు జూన్‌లో, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మరియు టాటా గ్రూప్ యొక్క పరిశోధనా బృందం కలిసి ఫెలుడా కిట్‌ను ఏర్పాటు చేశాయి. యాంటిజెన్లు మరియు ఆర్టిపిసిఆర్ టెస్ట్‌తో పోలిస్తే ఈ కిట్ చవకైనది. అలాగే తక్కువ సమయంలో ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కిట్ జన్యు సవరణ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఇది RTPCR మరియు యాంటిజెన్ కిట్ల కంటే చౌకైనది.
Published by:
Krishna Adithya
First published:
November 9, 2020, 5:00 PM IST