బైక్ సీజ్ చేసిన పోలీసులు... నిప్పంటించుకున్న యువకుడు... ఏం జరిగిందంటే...

ఆ యువకుడు అంతపని చేస్తాడని పోలీసులు అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఈ ఘటన తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

news18-telugu
Updated: July 13, 2020, 12:14 PM IST
బైక్ సీజ్ చేసిన పోలీసులు... నిప్పంటించుకున్న యువకుడు... ఏం జరిగిందంటే...
బైక్ సీజ్ చేసిన పోలీసులు... నిప్పంటించుకున్న యువకుడు... (File)
  • Share this:
అతని వయసు 27 ఏళ్లు. పేరు ముగిలాన్. ఓ భార్య, ముగ్గురు పిల్లలు. తమిళనాడు... అంబర్‌లోని అన్నా నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి... బైకుపై వెళ్తూ తిరుపట్టూర్ పోలీసులకు చిక్కాడు. "ఇలాగైతే ఎలా... కరోనా ఎలా తగ్గుతుంది?" అంటూ పోలీసులు... బైకును సీజ్ చేశారు. తమిళనాడులో జులై 31 వరకూ పూర్తి లాక్‌డౌన్ ఉంది. అందువల్ల పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి... వాహనదారుల్ని అడ్డుకుంటున్నారు. అదే విధంగా ముగిలాన్ బైకును కూడా ఆపారు. ముగిలాన్ ఇల్లు... అక్కడకు కాస్త దగ్గర్లోనే ఉంది. లాక్‌డౌన్ సమయంలో... ఉత్తినే రోడ్లపై ఎందుకు తిరుగుతున్నావ్ అని పోలీసులు అడిగారు. కాస్త మద్యం మత్తులో ఉన్న ముగిలాన్... సరైన సమాధానం చెప్పలేదు.

రాజీ పడే ప్రసక్తే లేదన్న పోలీసులు... బండిని సీజ చేసి... IPC సెక్షన్ 269, 188 కింద కేసు రాశారు. ముగిలాన్ పోలీసుల్ని బతిమలాడాడు. ఇంకెప్పుడూ అలా చెయ్యనన్నాడు. అయినా పోలీసులు మాట వినలేదు. ఆవేశంతో ముగిలాన్ తన ఇంటికి వెళ్లి... ఓ కిరోసిన్ క్యాన్‌తో వెనక్కి వచ్చాడు. పోలీసుల చెక్‌పోస్టుకి కాస్త దగ్గర్లోనే కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. నడిరోడ్డుపై అతను అలా చెయ్యడాన్ని కొంత మంది వీడియో తీశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు తనను కావాలనే ఆపారనీ, అన్యాయంగా బండిని లాక్కున్నారని ముగిలాన్ నిప్పంటించుకుంటూ ఆరోపించాడు. తాను చనిపోతున్నాననీ, దానికి పోలీసులే బాధ్యులు అని ఆరోపించాడు.

పరిగెట్టుకు వెళ్లిన పోలీసులు... ముగిలాన్‌ ఒంటిపై మంటల్ని ఆర్పారు. వెంటనే అంబర గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెల్లూర్ CMC హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ముగిలాన్ 80 శాతం కాలిన గాయాలతో ఉన్నాడు. అతను మద్యం తాగాడని డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో... తిరుపత్తూర్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్... విజయకుమార్ IPS... దీనిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ చేయాలని డీఎస్పీ ప్రవీణ్ కుమార్‌ను ఆదేశించారు. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంగా ఓ FIR కూడా నమోదైంది. ఐదుగురు పోలీసులు, హోమ్ గార్డులపై ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. వారిని అంబర్ నుంచి తిరుపత్తూర్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి షిఫ్ట్ చేశారు.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading