అప్పుడు గోడ... ఇప్పుడు గొయ్యి... తమిళనాడు వింత చేష్టలు

కొద్దిరోజుల క్రితం ఏపీ తమిళనాడు సరిహద్దులను మూసేయడానికి ఏకంగా గోడ కట్టిన ఘటన మరువకముందే... అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

news18-telugu
Updated: May 6, 2020, 1:11 PM IST
అప్పుడు గోడ... ఇప్పుడు గొయ్యి... తమిళనాడు వింత చేష్టలు
సరిహద్దుల్లో ప్రొక్లెయినర్లతో గొయ్యి తవ్వుతున్న అధికారులు
  • Share this:
కొద్దిరోజుల క్రితం ఏపీ తమిళనాడు సరిహద్దులను మూసేయడానికి ఏకంగా గోడ కట్టిన ఘటన మరువకముందే... అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం దగ్గర తమిళనాడులోకి ఏపీ ప్రజలు రావొద్దంటూ అక్కడి అధికారులు గొయ్యి తవ్వేశారు. జేసీబీ సాయంతో అక్కడి అధికారులు స్వయంగా ఈ పనులను పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే తమిళనాడు అధికారులు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రజలు ఈ రకమైన చర్యలకు దిగడంపై నిరసన వ్యక్తం చేసినా... తమిళనాడు అధికారులు మాత్రం గొయ్య తవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దీనిపై ఏపీ అధికారులకు తమిళనాడు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

Tamil nadu officials dig road to avoid ap people coming to their state in chittoor district ak  అప్పుడు గోడ... ఇప్పుడు గొయ్యి... తమిళనాడు వింత చేష్టలు
గోడను కూల్చుతున్న అధికారులు


ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రతం ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డు మీద గోడలు కట్టడం తీవ్ర దుమారం రేపింది. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు జరగకుండా అడ్డంగా గోడలను పెట్టేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు వేలూరు జిల్లా అధికారులు చెప్పారు. ఐతే తమిళనాడు అధికారుల తీరుతో చుట్టు పక్కల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు తమిళనాడులోని వేలూరు కలెక్టర్ దిగొచ్చారు. ఆంధ్రా సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా కట్టిన ఆ గోడలను ప్రొక్లెయినర్లతో కూల్చివేశారు.


First published: May 6, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading