తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్...

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: August 2, 2020, 5:40 PM IST
తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్...
భన్వరీలాల్ పురోహిత్, తమిళనాడు గవర్నర్
  • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయిందని తెలిసిన కొన్ని నిమిషాల్లోనే మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. భన్వరీలాల్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కావేరి ఆస్పత్రిలో ఆయనకు మరిన్ని చికిత్సలు చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ తక్కువ స్థాయిలోనే ఉందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.  ప్రస్తుతం ఆయన్ను హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి పరిశీలిస్తుందని కావేరి ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. భన్వరీలాల్‌కు ఎలాంటి లక్షణాలు లేవు. ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అంతకు ముందు రాజ్ భవన్‌లో 87 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

కావేరి ఆస్పత్రి ప్రకటన


తమిళనాడులో కరోనా కేసులు భారీగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 2.46 లక్షల కరోనా కేసులు తమిళనాడులో నమోదయ్యాయి. అందులో 1.84 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3935 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading