Home /News /coronavirus-latest-news /

TAMIL NADU GOVERNMENT TO BEAR EXPENSES OF COVID 19 PATIENTS IN PRIVATE HOSPITALS SAYS CM MK STALIN SU

Free Treatment for Covid: సీఎం సంచలన నిర్ణయం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ ఫ్రీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్రీగా చికిత్స అందించనున్నారు. ఇందుకోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

    దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. చాలా మంది పేదలు కరోనా సోకితే ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనా‌కు చికిత్స చేయించుకోవాలంటే అది భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ మాత్రం సంచలన ప్రకటన చేశారు. ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందే కరోనా రోగులకు సంబంధించి మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందే కోవిడ్ రోగుల ఖర్చులను స్టేట్ హెల్త్ ఇన్సురెన్స్ కవర్ భరించనున్నట్టు చెప్పారు. దీంతో పాటు మరికొన్ని ముఖ్యమైన ఉత్తర్వులపైన కూడా స్టాలిన్ సంతకం చేశారు.

    ఇక, తమిళనాడులో రైస్ కార్డు లబ్దిదారులకు అందరికి రూ. 2వేలు అందజేసేలా ఆదేశాలు జారీచేశారు. తమిళనాడులో 2.07 కోట్ల రైస్ కార్డ్స్ ఉన్నట్టుగా గణంకాలు చెబుతున్నాయి. ‘2.07 కోట్ల రైస్ రేషన్ లబ్దిదారులకు రూ. 2వేలు అందజేసే ఆర్డర్‌పై సీఎం స్టాలిన్ సంతకం చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం రూ. 4,153.39 కోట్లు ఖర్చు కానుంది’అని అధికారిక ప్రకటన విడుదలైంది.

    డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మీ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొత్త విభాగం ఏర్పడింది. ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’ పథకానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దీనికింద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వీకరించిన ప్రజా సమస్యల తాలూకు పిటిషన్లను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పరిష్కరించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,200 కోట్ల రూపాయలను సబ్సిడీగా ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు విడుదల చేసింది.

    పాల ధరల తగ్గింపు.. ఎన్నికల డీఎంకే ఇచ్చిన హామీ మేరకు పాల ధర తగ్గింపు దిశగా అడుగులు పడ్డాయి. ప్రభుత్వ అధీనంలోని డెయిరీ సంస్థ ఏవియన్ పాలపై లీటరుకు రూ.3 తగ్గించే ఉత్తర్వులపై సీఎం స్టాలిన్ సంతకం చేశారు.

    ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’ పథకానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దీనికింద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వీకరించిన ప్రజా సమస్యల తాలూకు పిటిషన్లను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పరిష్కరించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు