Home /News /coronavirus-latest-news /

TAMIL NADU CM STALIN POSTED A VIDEO ON TWITTER WITH MASKS FOR THOSE WHO DO NOT WEAR MASKS SNR

మాస్కులు పెట్టుకోకపోతే మీకే నష్టం..పబ్లిక్‌ప్లేసులో అవగాహన కల్పించిన సీఎం స్టాలిన్

photo credit: twitter

photo credit: twitter

Tami Nadu: ముఖ్యమంత్రి హోదాలో ఉండి సాధారణ ప్రజలకు తమ బాధ్యతలను గుర్తు చేసారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మాస్కులు పెట్టుకోవడం మర్చిపోవద్దని ప్రజలకు సూచించారు. పబ్లిక్‌ ప్లేసులో మాస్కులు ధరించని వాళ్లకు తానే స్వయంగా మాస్కులు తొడిగి వీడియోని సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేశారు.

ఇంకా చదవండి ...
ఆయన ట్రాఫిక్ పోలీస్ (Traffic police)కాదు, వైద్య,ఆరోగ్య సిబ్బంది (Health worker)అంతకన్న కాదు. కానీ వాళ్లిద్దరు చేయాల్సిన పనిని ఎంతో బాధ్యతగా నిర్వహించారు. పరిపాలన పరమైన నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేయడంలో బిజీగా ఉంటే ముఖ్యమంత్రి (Chief minister)ఓ సాధారణ వ్యక్తిలా ప్రజల మధ్యకు వచ్చి మాస్క్‌ (Mask)ధరించాలంటూ అవగాహన కల్పించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందుకే ఆయన అలా చేయడం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు తమిళనాడు (Tamil nadu)ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Mk stalin).ప్రపంచ వ్యాప్తంగా కరోనా (Corona)మరోసారి విరుచుకుపడటంతో ..రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేయాల్సి బాధ్యతను ఆయన స్వయంగా తన భుజాలపై వేసుకున్నారు. తమిళనాడులో హెడ్‌ క్వార్టర్స్ నుంచి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్తుండగా రోడ్డుపై మాస్క్‌లు పెట్టుకోని వాళ్లు, నిబంధనలు ఏమాత్రం పాటించని వాళ్లను చూసి ఆగిపోయారు సీఎం. కాన్వాయ్‌ (Convoy)ని ఆపి మాస్కులు పెట్టుకోని వాళ్లకు ఆయనే మాస్కులను ఉచితంగా పంపిణి చేశారు. కొందరికైతే తానే స్వయంగా మాస్కులు తొడిగారు. దీనికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు సీఎం స్టాలిన్. కరోనా థర్డ్‌ వేవ్ పొంచి వేళ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని..అందరూ మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని, సోషల్ డిస్టెన్స్(Social distance) పాటించాలని ట్విట్టర్‌ (Twitter)ద్వారా సూచించారు.

బాధ్యత కలిగిన పౌరుడిగా..
ఓవైపు అన్నీ రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడుతున్నారు. మిగిలిన వాళ్లు మహమ్మారి బారిన పడకుండా జనం మధ్యలో రావడం లేదు. కానీ తమిళనాడు సీఎం మాత్రం రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకూడదన్న మంచి సంకల్పంతో ఈ విధంగా అవగాహన కల్పించారు. ఇది చూసిన నెటిజన్లు ఎంకే స్టాలిన్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడుకే కాదు..అన్నీ రాష్టాల ముఖ్యమంత్రులు ఇంతే బాధ్యతగా వ్యవహరించాలంటూ తమిళనాడులోని పలు సోషల్ మీడియా గ్రూప్‌లో మెసేజ్‌లు కూడా పోస్ట్ చేస్తున్నారు.

సీఎం స్టాలిన్‌ రూటే సెపరేటు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిత్యం ఏదో రూపంలో ప్రజలకు దగ్గరవుతున్నారు సీఎం స్టాలిన్. సినిమాల్లో చూపించినట్లుగా ముఖ్యమంత్రి జనం మధ్యకు రావడం, వారి మంచి-చెడు గురించి తెలుసుకోవడం వంటివి చేశారు. ఆమధ్య చెన్నైలో సంభవించిన వర్షాలు, వరదల సమయంలో కూడా బాధితులకు అండగా నిలిచారు. వరద బాధితులకు పునరావాస, సహాయకచర్యలు వేగవంతం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇలా ప్రతి విషయంలో ముఖ్యమంత్రి అంటే సచివాలయంలో కూర్చునే వ్యక్తి కాదు నిజమైన ప్రజాసేవకుడు అనే మంచి పేరును సంపాధించుకుంటున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
Published by:Siva Nanduri
First published:

Tags: Chennai, Corona alert, MK Stalin

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు