ఒకటి నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్... ఆ సీఎం సంచలన నిర్ణయం

కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరూ పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయినట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: March 25, 2020, 4:14 PM IST
ఒకటి నుంచి 9వ తరగతి వరకు అందరూ పాస్... ఆ సీఎం సంచలన నిర్ణయం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తమిళనాడు సీఎం పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరూ పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయినట్టు ప్రకటించారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కరోనా వైరస్ వలన స్కూళ్లు మూసేశారు. విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి లేదు. అందుకే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అందరినీ పాస్ చేసేయమని అధికారులను ఆదేశించాం.’ అని ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. కరోనా వైరస్ వల్ల కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పళనిస్వామి చెప్పారు. ‘కొందరు 12వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నట్టు నా దృష్టికి వచ్చింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తేదీలను త్వరలో ప్రకటిస్తాం.’ అని పళనిస్వామి చెప్పారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాట సుమారు 34వేల మంది 12వ తరగతి విద్యార్థులు మంగళవారం రోజు పరీక్షకు హాజరుకాలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మార్చి 27 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు