Beggar Donation | కరోనా రిలీఫ్ ఫండ్‌కు రూ.90వేలు విరాళం ఇచ్చిన యాచకుడు

పూల్‌పాండియన్‌ను అభినందిస్తున్న కలెక్టర్ (Image;Twitter)

PoolPandian | కరోనా రిలీఫ్ కోసమే కాదు. గతంలో కూడా అతడు ఎంతో విరాళం ఇచ్చాడు. ప్రభుత్వ స్కూళ్లలో టేబుళ్లు, కుర్చీలు కొనుక్కోవడానికి కూడా కొంత నగదును అందజేశాడు.

  • Share this:
    తమిళనాడులో ఓ యాచకుడు కరోనా రిలీఫ్ ఫండ్‌కు రూ.90వేలు దానం చేశాడు. అతడి పేరు పూల్‌పాండియన్. తమిళనాడులోని మధురై జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూల్ పాండియన్ దఫదఫాలుగా ఈ నిధులను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ‌కు అందజేశాడు. యాచకుడి దాతృత్వాన్ని మెచ్చుకున్న కలెక్టర్ టీజీ వినయ్ ఆ దానం చేసిన పూల్‌పాండియన్‌కు అవార్డును కూడా ప్రకటించారు. పూల్‌పాండియన్ మొదటగా మే 18న రూ.10,000ను తమిళనాడు సీఎంఆర్ఎఫ్‌కు అందజేశారు. అనంతరం ఇప్పటి వరకు మరో 9 సార్లు మొత్తం రూ.90,000 విరాళం ఇచ్చారు. అతడి గురించి తెలుసుకున్న కలెక్టర్ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అతడి పేరును కూడా ప్రస్తావించారు. అతడికి సామాజిక కార్యకర్తగా అభినందించి అవార్డు కూడా అందించాలనుకున్నారు. అయితే, అతడు ఎక్కడ ఉంటాడో తెలీదు కాబట్టి అందివ్వలేకపోయారు.

    అసలు అతడిని గుర్తించడం కూడా విచిత్రంగా జరిగింది. ఓ యాచకుడు వచ్చి సీఎంఆర్ఎఫ్‌కు రూ.10వేలు విరాళం ఇవ్వడం వింత అనుకుంటే, అతడు మళ్లీ మళ్లీ వచ్చి విరాళం అందిస్తుండడంతో వారు ఆశ్చర్యపోయారు. గత సోమవారం మరోసారి విరాళం ఇవ్వడానికి రావడంతో నేరుగా కలెక్టర్ చాంబర్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడ పూల్‌పాండియన్‌ను చూసిన కలెక్టర్ యాచకుడిని అభినందించకుండా ఉండలేకపోయారు.

    పూల్‌పాండియన్ వాస్తవానికి తూత్తుకుడి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇద్దరు కొడుకులు కూడా అతడి గురించి పట్టించుకోకపోవడంతో పొట్టపోసుకోవడానికి యాచకుండిగా మారాడు. కరోనా రిలీఫ్ కోసమే కాదు. గతంలో కూడా అతడు ఎంతో విరాళం ఇచ్చాడు. ప్రభుత్వ స్కూళ్లలో టేబుళ్లు, కుర్చీలు కొనుక్కోవడానికి కూడా కొంత నగదును అందజేశాడు. అలాగే, విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించేందుకు కూడా ఆయన విరాళాన్ని అందించాడు.

    కరోనా లాక్ డౌన్ సమయంలో అందరు యాచకుల్లానే పూల్‌పాండియన్‌ను కూడా అధికారులు మధురైలోని ఓ షెల్టర్‌కు తరలించారు. కానీ, కొన్ని రోజులకే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత యాచకత్వం ద్వారా వచ్చిన డబ్బును డొనేట్ చేస్తున్నాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: