Home /News /coronavirus-latest-news /

TAMIL HERO AJITH DONATES ONE CRORE 25 LAKH RUPEES TO PM RELIEF AND TAMIL NADU CM RELIEF FUND FEFSI TA

ప్రధాని, ముఖ్యమంత్రి సహాయనిధికి తమిళ స్టార్ హీరో అజిత్ విరాళం..

 అజిత్ (ajith kumar)

అజిత్ (ajith kumar)

శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు..  సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. తాజాగా తమిళ అగ్రనటుడు అజిత్ కుమార్ తన వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రితో పాటు సినీ కార్మికులకు తన వంతు సాయం అందజేసారు.

ఇంకా చదవండి ...
    శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు..  సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్ సినీ నటులు కరోనా క్రైసెస్ ఛారిటీని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ అగ్ర నటుడు అజిత్.. తన వంతుగా రూ. 1 కోటి 25 లక్షల విరాళం ప్రకటించారు. అందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు మరియు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Palanisami, PM Narendra Modi, Tamil Cinema, Tamilnadu, Thala ajith

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు