Home /News /coronavirus-latest-news /

TAKING ALL STEPS TO PROTECT FROM CORONAVIRUS SAYS MINISTER EATELA RAJENDER BS

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..

మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

Coronavirus Telangana Government : దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.

ఇంకా చదవండి ...
    Coronavirus Telangana Government : దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. కరోనాను కట్టడి చేసే దిశగా... ఈ రోజు అత్యవసర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏయే చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వెల్లడించారు.
    కేబినెట్ సబ్ కమిటీ సమావేశం


    శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తొమ్మిది శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రతి శాఖకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని నియమిస్తామన్నారు. అటు.. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా అన్న అనుమానం వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులను పంపించాలని కోరినట్లు స్పష్టం చేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Coronavirus, Covid-19, Etela rajender, Telangana Government, Trs

    తదుపరి వార్తలు