తిరుమల శ్రీవారి దర్శనాల నిలిపివేత పొడిగింపు.. అప్పటి వరకు అంతే..

భక్తులకు దర్శనాలను నిలిపివేసినప్పటికీ స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయని తెలిపారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

news18-telugu
Updated: April 14, 2020, 3:21 PM IST
తిరుమల శ్రీవారి దర్శనాల నిలిపివేత పొడిగింపు.. అప్పటి వరకు అంతే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఐదే కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడం, మే 3వ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించిన నేపథ్యంలో శ్రీవారి దర్శనాల నిలుపుదలను కూడా టీటీడీ పొడిగించింది. మే 3 వరకు దర్శనాల రద్దు కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లను యథావిధిగా మూసివేసే ఉంటాయని తెలిపింది. తిరుమలలోనూ లాక్‌డౌన్ కఠినంగా అమల్లో ఉంటుదని స్పష్టం చేసింది. టీటీడీ భక్తుల నివాస కేంద్రాలు, కొండపై షాపులు, హోటళ్లు ఏవీ తెరచుకోవని అధికారులు చెప్పారు.

భక్తులకు దర్శనాలను నిలిపివేసినప్పటికీ స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయని తెలిపారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. తిరుమలలో భక్తుల దర్శనాలను నిలిపివేయడం, లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనాథలు, బిచ్చగాళ్లు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని టీటీడీ ఆదుకుంటోంది. రోజుకు 50వేల ఆహార ప్యాకెట్లను తయారుచేసి ఉచితంగా పంచిపెడుతున్నారు. తుడా, మున్సిపల్ సిబ్బంది వీటిని అందజేస్తున్నారు. పులిహోర, సాంబారు అన్నం, పెరుగన్నం, ఉప్మా, టమోటా రైస్ పొట్లాలను పేదలకు పంపిణీ చేస్తున్నారు. తిరుపతి పరిధిలోని 50 వార్డుల్లో 50 వాహనాల ద్వారా నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: April 14, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading