కరోనా పై పోరాటానికి సుశాంత్, సందీప్ కిషన్ విరాళం..

సుశాంత్,సందీప్ కిషన్ విరాళం (Twitter/Photo)

కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా సుశాంత్, సందీప్ కిషన్ తమ వంతు సాయం ప్రకటించారు.

  • Share this:
    కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో సినిమా కార్మికులు కూడా ఆకలిలో అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్‌లో కరోనా క్రైసెస్ ఛారిటీకి ఏర్పడింది. ఇప్పటికే పలువురు ఈ ఛారిటీకి తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ఈ కోవలోనే ప్రముఖ సినీ నటుడు సుశాంత్ రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు మరోహీరో సందీప్ కిషన్  రూ. 3 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నానితో నిన్నుకోరి సినిమాతో పాటు ‘టక్ జగదీష్’ సినిమాను నిర్మిస్తున్న సాహు గారపాటి, హరీష్ పెద్ది కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. ఇంకోవైపు సమీర్ రెడ్డి, మూరెళ్ల ప్రసాద్ నేతృత్వంలోని తెలుగు సినిమాటోగ్రఫర్స్ అసోసియేషన్ రూ. 50 వేలు విరాళాన్ని ప్రకటించారు. మొత్తానికి కరోనా వ్యతిరేక పోరాటంలో ఎవరికి వారు తమ వంతు సాయం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: