Suresh Angadi Passes Away : కరోనాతో కేంద్ర మంత్రి మృత్యువాత

Suresh Angadi Death News: కేంద్రరైల్వే  శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. కరోనా వైరస్ ఆయన్ను పొట్టనపెట్టుకుంది.

news18-telugu
Updated: September 23, 2020, 9:23 PM IST
Suresh Angadi Passes Away : కరోనాతో కేంద్ర మంత్రి మృత్యువాత
కేంద్ర మంత్రి సురేష్ అంగడి (File)
  • Share this:
కేంద్రరైల్వే  శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. కరోనా వైరస్ ఆయన్ను పొట్టనపెట్టుకుంది. సురేష్‌కు కరోనా వైరస్ రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సురేష్ అంగడి కర్ణాటకకు చెందిన నేత. సెప్టెంబర్ 11వ తేదీన సురేష్ అంగడికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు చెప్పారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నేను బాగానే ఉన్నాను. డాక్టర్ల సలహా తీసుకుంటున్నా. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్‌ అయిన వారికి ఒకవేళ ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి.’ అని సూచించారు. అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ కన్నుమూశారు. సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావిలో 1955 జూన్ 1న జన్మించారు. ఆయన భార్య మంగళ అంగడి కూడా ఈ ఏడాదే కన్నుమూశారు. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారి బీజేపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ రెండోసారి గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా నియమించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading