Home /News /coronavirus-latest-news /

SUPREME COURT SAYS 15 DAYS ENOUGH FOR STATES TO TRANSPORT MIGRANT LABOURERS BACK HOME BA

కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 15 రోజుల డెడ్ లైన్...

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది.

    వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది. వలస కూలీలను తరలించేందుకు ఆ సమయం సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తుది తీర్పును జూన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. వలస కూలీల బాధలకు సంబంధించి దాఖలైన ఓ పిల్ మీద సుమోటోగా విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘మేం ఏం చేయాలనుకుంటున్నామంటే.. వలస కూలీలను సొంతూరుకు చేర్చడానికి రాష్ట్రాలు, కేంద్రానికి 15 రోజుల గడువు ఇస్తాం. అలాగే, వలస కూలీలకు ఉపాధి ఎలా చూపిస్తారో కూడా అన్ని రాష్ట్రాలు స్పష్టంగా చెప్పాలి. వలస కూలీల ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలి.’ అని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సుమారు కోటి మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. రైళ్లలో 57 లక్షల మందిని, బస్సుల్లో 41 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టె కోర్టుకు తెలిపారు. ఢిల్లీలో సుమారు 2 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని, వారు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సిద్ధపడడం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ చెప్పారు. కేవలం 10,000 మంది మాత్రమే సొంతూళ్లకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నారు. యూపీ ప్రభుత్వం కూడా దాదాపు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Coronavirus, Covid-19, Migrant Workers, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు