కరోనా ఎఫెక్ట్... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం... ఇకపై అలా...

ప్రభుత్వాలే కాదు... న్యాయవ్యవస్థలు కూడా కరోనా దృష్ట్యా... టెక్నాలజీని వాడేసుకోవాలని డిసైడయ్యాయి. పాత పద్ధతులకు గుడ్ బై చెప్పబోతున్నారు.

news18-telugu
Updated: July 11, 2020, 8:46 AM IST
కరోనా ఎఫెక్ట్... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం... ఇకపై అలా...
కరోనా ఎఫెక్ట్... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం... ఇకపై అలా...
  • Share this:
మన దేశంలో కోర్టు నోటీసులనే అంశం కాలయాపనతో కూడుకుంటోంది. చాలా సందర్భాల్లో ఓ నోటీసులు సంబంధిత వ్యక్తులకు చేరడానికి చాలా టైమ్ పడుతోంది. ఇకపై అలా జరగదు. నోటీస్ జారీ చేసిన కొన్ని క్షణాలకే అది చేరిపోతుంది. ఎందుకంటే... ఇకపై కోర్టు నోటీసులు, సమన్లను వాట్సాప్, ఈ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది. దీనికి కారణం... లాయర్లే. కరోనా టైంలో సంప్రదాయ సమన్లు, నోటీసుల వల్ల కరోనా సోకే ప్రమాదం పెరుగుతోందని లాయర్లు ఆవేదన చెందడంతో... ఈ విషయాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు... "డిజిటల్ చేసేస్తే పోలా"... అనుకుంది. అయిపోయింది.

ఇప్పటికే కోర్టులు... వీడియో కాన్ఫరెన్సుల ద్వారా... విచారణలు చేస్తున్నాయి. టెక్నాలజీని ఇలా అన్ని అంశాల్లో వాడేయడమే కరెక్ట్ అని సుప్రీంకోర్టు భావించింది. ఎందుకంటే కరోనా ఇప్పట్లో వదిలేలా లేదు. పైగా... ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్ కూడా రావడానికి 2021 ఏప్రిల్ అవుతుందనే కొత్త అంచనా ఉంది. అదీకాక... రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు డిజిటల్‌లో పంపితే... ఏ సమస్యా ఉండదు. అలాగే వ్యక్తులకు ఆ సమన్లు, నోటీసులూ... ఫటాఫట్ చేరతాయి. నోటీస్ పంపినట్లు, చేరినట్లు పక్కా ఆధారాలు ఉంటాయి కాబట్టి "నాకు రాలేదు"... అనే ఛాన్స్ కూడా ఉండదు.

వాట్సాప్‌లో మనం పంపిన మెసేజ్ అవతలి వాళ్లు చూస్తే... బ్లూ కలర్ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా... అలా నోటీస్ పంపినప్పుడు దాన్ని చూడగానే ఆ మార్క్ కనిపిస్తుందని జస్టిస్‌ ఎస్‌.బోపన్న, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఐతే... కొంతమంది ఇలా బ్లూ మార్క్ కనపడకుండా వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆప్షన్లు మార్చుకుంటారు. అయినప్పటికీ... నోటీస్ పంపినట్లైతే ప్రూఫ్ కచ్చితంగా ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading